ఇండియాకు చైనా ఆర్మీ చిన్న గుడ్ న్యూస్

-

అరుణాచల్ నుండి తప్పిపోయిన అయిదుగురు భారతీయులను చైనా తిరిగి అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని ఆర్మీ అధికారులు చెప్పారు. సెప్టెంబర్ 2 నుండి ఈ ఐదుగురు తప్పిపోయారు. ఈ నెల ప్రారంభంలో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల నుండి తప్పిపోయిన ఐదుగురిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారతదేశానికి అప్పగించడానికి సిద్దంగా ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనా భూభాగంలోనే వారిని భారత్ కు అప్పగిస్తారు.

india-china

“అరుణాచల్ ప్రదేశ్ నుండి వెళ్ళిన వారిని మనకు తిరిగి అప్పగించాలని చైనా ఆర్మీని భారత ఆర్మీ కోరింది. సెప్టెంబర్ 12 న ముందుగా నిర్దేశించిన ప్రదేశంలో వారిని అప్పగించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 1 నుండి తప్పిపోయిన ఐదుగురు వ్యక్తులు వేటగాళ్ళు అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version