బ్రిటిష్ బ్రాడ్ క్యాస్టింగ్ కంపెనీ(బీబీసీ) పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా మహమ్మారి టైమ్ లో బీబీసీ అనవసరమైన విషయాలని, తప్పుడు వార్తలని ప్రపంచానికి చేరవేసిందని, ఆ కారణంగానే చైనా ప్రభుత్వం బీబీసీని నిషేధించిందని చైనా అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయమే బీబీసీ ఇలా స్పందించింది. ప్రపంచ మీడియాలో బీబీసీ స్థానం అందరికీ తెలుసనీ, జర్నలిజం విలువలకి కట్టుబడుతూ, ఎక్కడా ఎవరికీ ఫేవర్ గా వెళ్ళకుండా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతామని, ఇప్పటివరకు అలాగే ఉన్నామని, ఇకముందు కూడా అలాగే ఉంటామని, ప్రజలకు చేరవేయాల్సిన వార్తలని, వాస్తవాలని తెలియజేస్తామని బీబీసీ ప్రతినిధులు అన్నారు.
చైనా లో కమ్యూనిజం కారణంగానే ఇలాంటి నిషేధం ఏర్పడిందని కొందరు మాట్లాడుకుంటున్నారు. తమ వార్తలని ప్రపంచానికి తెలియనివ్వకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారని మరికొందరి వాదన. ఏది ఏమైనా బీబీసీని బ్యాన్ చేసిన అంశం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.