భారత రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో సానుకూల ఫలితం రాబట్టేందుకు మిగిలిన సభ్యులతో కలిసి పని చేయడానికి తాము సిద్ధమేనని చైనా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావోనింగు ప్రకటన చేశారు. కొన్ని అంశాలపై g20 సదస్సులో ఇప్పటికే ఏకాభిప్రాయం కుదరని విషయము తెలిసినదే. తాజాగా ఈ పరిస్థితి పై బ్రిటన్ ప్రధాని స్పందిస్తూ.. చైనా కారణంగానే వివిధ అంశాలపై ఒప్పందాలు కుదరడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించినట్లు పాలు కథనాలు వెలువడ్డాయి.
దీంతో చైనా తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు తాము అందరితో కలిసి పని చేస్తాం అని వివరణ కూడా ఇచ్చింది. మరోవైపు భారత్ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షితా మూర్తి ఇవాళ భారత్ కి చేరుకున్నారు. ఆయనకు బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్,కేంద్ర మంత్రి అశ్వని కుమార్ చౌబే స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సునాక్ భారత్ రావడం ఇదే మొదటి సారి.