చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తత… మరోసారి చైనా దుశ్చర్య.

-

చైనా మరోసారి తన దుశ్చర్యకు పాల్పడింది. ఇప్పటికే పలు మార్లు తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉద్రిక్తతలను రాజేస్తోంది. మరోసారి చైనీస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 9 విమానాలు తైావాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. గత కొన్ని రోజులుగా తైవాన్ ను స్వాధీనం చేసుకోవాలని చైనా తన దురాక్రమణ విధానానికి ప్రణాళికలు రచిస్తోంది. గతంలో కూడా ఇలాగే తమ ఏయిర్ ఫోర్స్ కు చెందిన యుద్దవిమానాలను, హెచ్ 6 బాంబర్లను తైవాన్ ఏయిర్ డిఫెన్స్ ఐటెంటిఫికేషన్ జోన్ లోకి  పంపింది. తాజాగా తైవాన్ కు నైరుతి దిశ నుంచి చైనీస్ యుద్దవిమానాలు తైవాన్ గగనతలాన్ని అతిక్రమించాయి.

ప్రజాస్వామ్య తైవాన్ ను ఎప్పటి నుంచో కబలించాలని చైనా చూస్తోంది. అయితే తాము స్వతంత్రంగా ఉంటామని… ఎవరి అధికారం తమపై ఉండదని తైవాన్ చెబుతోంది. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్లు తైవాన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ పరిణామాలు చైనాకు మింగుడు పడటం లేదు. దీంతోనే ప్రతీసారి తమ యుద్ద విమానాలను తైవాన్ మీదకు పంపి కవ్విస్తోంది. ఏడు దశాబ్ధాలుగా చైనా, తైవాన్ విడివిడిగానే ఉంటున్నాయి. అయితే చైనా మాత్రం వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అంటూ ప్రపంచానికి చెబుతోంది. ఓ రకంగా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. ఈ ఏడాది జూన్ 1న చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ తైవాన్ ను స్వాధీనం చేసుకుని చైనా పునరేకీకరణ సాధిస్తాం అంటూ ప్రతినబూనాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version