బియ్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.. ఆందోళన వద్దు : కిషన్ రెడ్డి

-

బియ్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని.. కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియా తో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, బియ్యం కొనుగోలుపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత దాన్ని ఇప్పుడు పెద్ద సమస్యగా టిఆర్ఎస్ సృష్టించే ప్రయత్నం చేస్తుందని.. పీయూష్ గోయల్ చాలా వివరంగా పార్లమెంట్ లో చెప్పారు..నేను అనేక సార్లు స్పందించానని తెలిపారు. మళ్ళీ ఈరోజు ప్రకటన కావాలని టిఆర్ఎస్ అనడం మంచిది కాదని.. చేసుకున్న ఒప్పందం ప్రకారం రా రైస్ ,బాయిల్డ్ రైస్ కొంటామని భారత ప్రభుత్వం చెప్తోందని వెల్లడించారు.


భారత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదని.. బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ఇతర విత్తనాలు ఇవ్వండని కేంద్రం సూచించిందని గుర్తు చేశారు. బాయిల్డ్ రైస్ రైస్ మిల్లర్లు తయారూ చేస్తున్నారని.. బియ్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అనేక తిట్లు తిడుతూ కేసీఆర్ శాపనార్దాలు పెట్టారని.. టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఇందిరా పార్కు లో ధర్నా చేశారని… కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటుంది..కేంద్రం కొనుగోళ్లు ఆపదు..రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.

మెడ మీద కత్తి పెట్టి ఏ ప్రభుత్వం ఒప్పందం రాయించుకోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ఫిబ్రవరిలో కూడా రైతులకు అన్యాయం జరగనివ్వమని తెలిపారు. బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలని… రాష్ట్ర ప్రభుత్వం భాద్యతా రహిత్యంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. “రా రైస్” ప్రతి గింజ కేంద్రం కొంటుందని.. రైతులకు నష్టం చేకూర్చే చర్యలు చేయవద్దన్నారు. అవగాహన లేకుండా కేంద్రంతో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వమని.. 44 లక్షల మెట్రిక్ టన్నులకి అందనంగా బాయిల్డ్ రైస్ కొంటున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version