అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం… తైవాన్ కు చైనా వార్నింగ్..

-

చైనా.. తైవాన్ మధ్య వివాదం రగులుతూనే ఉంది. వన్ చైనా విధానానికి తైవాన్ కట్టుబడి ఉండాలని చైనా ప్రభుత్వ ఇటు తైవాన్ కు, అటు ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇస్తోంది. గతంలో చైనా వైమానికి విమానాలు తైవాన్ గగనతలంపై చక్కర్లు కొట్టాయి. దీంతో వ్యవహారం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో చైనా బలవంతంగా సైనికచర్య ద్వారా తైవాన్ ను ఆక్రమించుకునేందకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. తాజా ఈవివాదం పై యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్ దేశాలు తైవాన్ కు అండగా నిలబడతాం అని  చెప్పడం చైనాకు మింగుడు పడటం లేదు. దీంతో అక్కసుతో ఉన్న చైనా ’తైవాన్ ను బలవంతంగా అయినా స్వాధీనం‘ చేసుకుంటాం అని ప్రకటించింది. గతంల లో కూడా ఇలాగే తైవాన్ కు చైనా వార్నింగ్ ఇచ్చింది. తాజాగా మరోమారు తైవాన్ కు వార్నింగ్ ఇచ్చింది.

స్వాతంత్రం కోసం పోరాడుతున్న తైవాన్ రాజకీయ నాయకులను శిక్షిస్తామని హెచ్చరించింది చైనా. తైవాన్ లో స్వతంత్రం కోసం పోరాడుతున్న వారిని చైనా చట్టాలకు అనుగుణంగా శిక్షిస్తామని బీజీంగ్ లోని తైవాన్ వ్యవహరాల కార్యాలయం హెచ్చరించింది. మరోవైపు.. తైవాన్ ప్రధాని సు సెంగ్‌-చాంగ్‌, పార్లమెంట్ స్పీక‌ర్ యూషి కున్‌, విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ త‌దిత‌రులు స్వతంత్ర ఉద్యమ‌కారుల‌కు మ‌ద్ధతిస్తున్నార‌ని తైవాన్ వ్యవ‌హారాల కార్యాల‌యం ప్రతినిధి ఝౌ ఫెంగ్లియ‌న్ అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version