చైనా భారీ ప్రయోగం… ఏకంగా 13వేల ఉపగ్రహాలు ప్రయోగించేలా ప్లాన్

-

డ్రాగన్ దేశం చైనా మరో భారీ ప్రయోగానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఆర్థిక రంగంలో ప్రపంచ నెంబర్ వన్ గా మారేందుకు ఉవ్విళ్లూరుతున్న చైనా… అంతరిక్షంలో కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇటీవల కృత్రిమ సూర్యున్ని ఏర్పాటు చేసి తన సత్తా చాటింది. అయితే తాజాగా మరో భారీ ప్రయోగానికి ప్లాన్ వేస్తుంది. ఏకంగా 13 వేల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ప్రణాళికలు వేస్తోంది. దాదాపు 12,992 ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి పంపాలని చైనా యోచిస్తోంది. ఈ ఉపగ్రహాలను భూమి ఉపరితలం నుంచి 498.89 కిలోమీటర్ల నుంచి 1144.24 కిలోమీటర్ల మధ్య అంతరిక్షంలో ఉంచనున్నారు.  5జీ ఇంటర్నెట్ సేవల కోసం ఈ ఉపగ్రహాలను ఉపయోగిస్తామని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే చైనా చర్యలపై మాత్రం ప్రపంచ దేశాలకు అనుమానాలు ఉన్నాయి. అన్ని దేశాలపై నిఘా పెంచేందుకే ఇలాంటి ప్రయోగాలు చేస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ పెద్దన్నగా మారాలని చైనా ప్రయత్నిస్తోంది. అమెరికా స్థానాన్ని ఆక్రమించాలని అనుకుంటోంది. దీంతో ఆర్థికంగా, సైనికంగా, టెక్నాలజీ పరంగా ఎదుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version