చింతమనేని నరకం చూపించాడు…నటి అపూర్వ

-

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తనకు నరకం చూపించాడని సినీ నటి అపూర్వ ఆరోపించారు. చింతమనేని  అనుచరులు తనపై అసత్య ప్రచారం చేస్తు తన ప్రతిష్టకు భంగం కలిగించమే కాకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ… సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న చింతమనేని అనుచరులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు కోరారు. గతంలో అపూర్వ ఓ వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఓ వివాదంలో చింతమనేని తనను వేధించడంతో.. ఆయన వల్లే గ్రామంలో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. నాడు నాకు  అండగా ఉంటాడనుకున్న ఎమ్మెల్యే నరకం చూపించాడని ఆమె  చెప్పారు.  మహిళనని చూడకుండ తనను కావాలనే చింతమనేని అనుచరులు టార్గెట్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version