అయోధ్యకు బయల్దేరిన చిరంజీవి, రామ్ చరణ్

-

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు అంత సిద్ధం అయింది. ఇవాళ మధ్యాహ్నం 12:20 నుంచి 01:00 గంటల మధ్యలో కార్యక్రమం జరగనుంది.ఈ మహాకార్యాన్ని వీక్షించేందుకు అతిథులతో పాటు సాధువులు వేల సంఖ్యలో అయోధ్య పురికి చేరుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు చిరంజీవి మరియు రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి యూపీ లోని అయోధ్య కు బయలుదేరారు.

Chiranjeevi and Ram Charan left for Ayodhya

రామ లల్లా విగ్రహ ప్రతిస్టాపన కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం ఒక అరుదైన అవకాశంగా మరియు అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా రామ్ చరణ్ పేర్కొన్నారు. నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాడని భావిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోతుండటం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇక అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకు బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version