రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభూషణ్ అవార్డు రావడంతో చిరంజీవికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే… తెలంగాణ ప్రభుత్వం కూడా మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించాలని నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకోసం ఫిబ్రవరి 4 న ఉదయం 10 గంటలకు శిల్పకళా వేదికలో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి చిరంజీవిని సత్కరించనున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రానున్నారు.రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చిరంజీవి, వెంకయ్య నాయుడులకు ఆహ్వానం అందిందని సమాచారం.