నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు ఎంతో దుర్ధినం, సోదర సమానుడు, సౌమ్యుడు అయిన హరికృష్ణ అకాల మరణం చెందడం చాలా బాధాకరం అన్నారు. ఏదైన వేడుకల్లో కలుసుకున్నప్పుడు నవ్వుతూ..నవ్వించే మనిషి హరికృష్ణ అలాంటి వ్యక్తి మరణించడం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు.