హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు బోల్తా పడి ఈ రోజు ఉదయం మరణించారు. ఆ ప్రమాద కారణాలను జిల్లా ఎస్పీ రంగనాథ్ విశ్లేషించి మీడియాకు వివరించారు..
హరికృష్ణ ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనంలో ఆయనతో పాటు విజయవాడకు చెందిన వ్యాపారి రావి వెంకట్రావు, శివాజీ అనే మరో వ్యక్తి ఉన్నారు.
స్వయంగా హరికృష్ణ డ్రైవింగ్ హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోపోవడం ఆయన మరణానికి ప్రధాన కారణం.
ప్రమాద సమయంలో దాదాపు 160 కిలో మీటర్ల వేగంతో కారు వెళ్లడంతో పాటు, రహదారిలో చిన్న లోపం కూడా ఉందన్నారు. ముందున్న టర్న్ ని గమనించని హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగారు..ఇంతలో మలుపుని గమనించి వెంటనే కారుని కుడివైపుకు కట్ చేశారు. ఆక్రమంలో డివైడర్ ను ఢీకొట్టి అదుపుతప్పి దాదాపు 20 అడుగులు పైకి ఎగిరింది… 20 మీటర్లు పల్టీలు కొట్టుకుంటూ..అటుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈక్రమంలో ఆయన సీటు బెల్టు పెట్టుకోపోవడం వల్ల కారులోంచి బయట పడి తలకి తీవ్ర గాయమైంది.
బెల్టు పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని గాయాలతో బయటపడేవారని ఆయన వివరించారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు.