విశాఖపట్నంలో స్టూడియో నిర్మించనున్న చిరంజీవి..? జగన్‌ను అందుకే కలిశారా..?

-

తాడేపల్లిగూడెంలోని జగన్ నివాసంలో ఆయనను కలిసిన మెగాస్టార్ ఆయనతో గంట పాటు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ హాట్ టాపిక్ అయింది.

ప్రజారాజ్యం పార్టీతో ఒకప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత పలు కారణాల వల్ల క్రమంగా రాజకీయాలకు దూరమై ఇప్పుడు కేవలం సినీ ఇండస్ట్రీకే పరిమితమయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ప్రస్తుతం చిరంజీవి యాక్టివ్‌గా లేరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆయన ఇవాళ భేటీ కావడం ఒక్కసారిగా అన్ని వర్గాల ప్రజలనూ షాక్‌కు గురి చేసింది.

తాడేపల్లిగూడెంలోని జగన్ నివాసంలో ఆయనను కలిసిన మెగాస్టార్ ఆయనతో గంట పాటు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ హాట్ టాపిక్ అయింది. మరోవైపు జగన్ సీఎం అయ్యాక టాలీవుడ్ నుంచి ఏ సినీ ప్రముఖులు కూడా జగన్‌ను కలవకపోగా, ఇప్పుడు ఏకంగా చిరంజీవి జగన్‌ను కలవడంపై కూడా అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ సీఎం అవడం ఇష్టంలేకే సినీ పెద్దలు ఆయనను కలవలేదని అప్పట్లో సినీ నటుడు, ఎస్‌వీబీసీ చానల్ డైరెక్టర్ పృథ్వీ ఆరోపించారు. ఈ క్రమంలో చిరంజీవి జగన్‌ను కలవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే జగన్, చిరంజీవిల మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయాన్ని తీసుకుంటే.. ముఖ్యంగా విశాఖపట్నంలో ఓ ఫిలిం స్టూడియో నిర్మించేందుకు చిరంజీవి సుముఖంగా ఉన్నారని, అందుకనే స్థలం కోసం సీఎం జగన్‌ను అడిగేందుకే ఆయనను చిరంజీవి కలిశారని వార్తలు వస్తున్నాయి. వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారని, అందుకనే అక్కడ స్థలం కోసం ఏపీ ప్రభుత్వం వైపు ఆయన చూస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version