చిత్ర పరిశ్రమ కార్మికులకు చిరంజీవి గుడ్ న్యూస్.. హెల్త్ కార్డుల పంపిణీ

-

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో యోధ డయోగ్నొస్టిక్ లైఫ్ టైం హెల్త్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి ఇవాళ పంపిణి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లైఫ్ నీ అతలాకుతలం చేసిందని.. సినీ పరిశ్రమకు కూడా ఏదైనా చెయ్యాలి అని యోధ డయోగ్నొస్టిక్ వారిని అడిగిన వెంటనే వాళ్ళు సరే అన్నారని పేర్కొన్నారు. కరోనా టైంలో ఇంటింటికీ వెళ్లి సీసీసీ వాళ్ళు నిత్యావసరాలు అందచేశారని గుర్తు చేశారు.

టెక్నికల్ తో కూడిన ఈ కార్డులో క్యూఆర్ కోడ్ వుంటుంది..దానిని బట్టి ఆకార్దూ కి చెందిన వారి కుటుంబ సభ్యుల హెల్త్ కు సంబంధించి వివరాలు మొత్తం వుంటాయని చెప్పారు. ప్రస్తుతం 18 యూనియన్లు కార్డులు రెడీ అయ్యాయని.. దాదాపు 7700 కార్డులు తయారు అయ్యాయి మిగతావి ఈ నెలాఖరు లోపు అవుతాయని చెప్పారు. 50 పర్సెంట్ రాయితీ తో ఆ కార్డును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్డును వినియోగించుకోవాలని కోరారు. సిని పరిశ్రమ కార్మికులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని.. కార్మికులకు ఎప్పుడు నేను అండగా వుంటానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version