ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వాలు ఎంత కఠిన ఆంక్షలు విధించినా వాటి వాడకం తగ్గటం లేదు. వాడి పడేసే వస్తువలు వినియోగంతో పర్యావరణ కాలుష్యం నానాటికి పెరిగిపోయింది. తాజాగా ఓ కొత్త రకం ఫుడ్ కంటైనర్లు ఈ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా వచ్చాయి. వరిపొట్టుతో తయారైన గ్లాసులు, ప్లేట్లకు సంబంధించిన ఓ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “ఈ ఫుడ్ కంటైనర్లు వరి పొట్టుతో తయారయ్యాయి. ఇవి లీక్ అవ్వవు, పైగా.. తక్కువ ధరకే లభిస్తాయి, భూమిలో తేలిగ్గా కరిగిపోతాయి, పర్యావరణానికి మేలు చేస్తాయి” ఇకనైనా తమిళనాడులోని హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లలో ప్లాస్టిక్ వాడకం ఆపేసి… ఇలాంటి పర్యావరణ హితమైనవి వాడాలి” అంటూ ఆమె రాసుకొచ్చారు.
అయితే ఇది తయారు చేసే యువకుడు, అతని ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా తయారు చేస్తున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది, ఈ బిజినెస్ వల్ల లాభమో నష్టమో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.