చిరు ట్వీట్ : నాకు బాగా సంతృప్తినిచ్చేది అదే..!

-

మెగాస్టార్ చిరంజీవి అత్యంత సంతృప్తినిచ్చిన సమయమది అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు ఆ వీడియో సారాంశం ఏంటంటే.. గతంలో తాను రక్తదానం చేసిన వీడియోలను అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా చిరు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన జీవితంలో తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సమయమది అంటూ దానికి కాప్షన్ పెట్టారు. అలాగే ఒకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుందని అన్నారు. ప్రజలు రక్తదానం చేస్తున్నారని తెలుసుకున్న ప్రతిసారి.. వారికి రక్తదానం చేసే శక్తిని ఇచ్చినందుకు తాను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ట్విట్టర్ లోకి వచ్చిన చిరు తన అభిమానులను బాగా అలరిస్తున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version