క‌రోనా పోరుకు చిరంజీవి తల్లి సాయం.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!!

-

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. గ‌త డిసెంబ‌ర్ చివ‌రిలో చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అతి త‌క్కువ టైమ్‌లోనే 205దేశాల‌కు పైగా క‌మ్మేసి.. ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెడుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా సోకి 90 వేల‌కుపైగా ప్ర‌జ‌లు
మృత్యువాత ప‌డ్డారు. ఇక ఈ మ‌హ‌మ్మారి బాధితులు ల‌క్ష‌ల్లో ఉన్నారంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు మొత్తం వ్యవస్థలన్నీ లాక్ డౌన్ అయిపోవడంతో ఆయా రంగాలకు చెందిన కింది స్థాయి కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.

దీంతో వారిని ఆదుకునేందు సినీ తార‌లు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు ఇలా ఎంద‌రో త‌మ వంతు సాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. ఇప్పటికే క‌రోనా పోరుకు పలువురు తారలు కేంద్రం సహాయ నిధితో పాటు రాష్ట్ర ప్ర‌‌భుత్వాల‌కు సైతం భారీ విరాళాలు అందించారు. ఇక మ‌రికొంద‌రు త‌మ‌కు తోచిన సాయాన్ని ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి త‌ల్లి అంజనా దేవి సైతం క‌రోనాతో యుద్ధానికి త‌న వంతు సాయం చేశారు.

అంజ‌నా దేవి.. త‌న స్నేహితురాళ్లతో కలిసి మూడు రోజుల పాటు క‌ష్ట‌ప‌డి 700 మాస్క్ లను తయారు చేశారు. వాటిని అవసరమైన వారికి అందించారు. నిజానికి ఆమె వయసును, వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా.. క‌రోనా పోరుకు త‌న వంతు సాయం చేయాల‌ని ఆమె పడిన క‌ష్టం, సమాజం పట్ల చూపిన బాధ్యతకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version