అక్కడ ఒక్క రోజే కరోనాతో రెండు వేల మంది మృతి…!

-

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కాదు, సునామి కంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దాదాపు అక్కడ పది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. న్యూయార్క్ లో ఇప్పటి వరకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఇక అక్కడ మరణాల విషయానికి వస్తే ఇప్పటి వరకు దాదాపు 19 వేల మంది మరణించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.

ఒక్క రోజే రెండు వేల మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా స్థాయిలో మరణాలు లేవు. న్యూయార్క్ లో నిన్న ఒక్క రోజే 800 మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కాలిఫోర్నియా, పెంటగాన్, మిచిగాన, టెక్సాస్ లో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు అడుగు పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

మియామి, ఫ్లోరిడా రాష్ట్రాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నా సరే ఇప్పట్లో అక్కడ కట్టడి కాదని అంటున్నారు. ఇది పక్కన పెడితే అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అక్కడ శవాలను పూడ్చడానికి స్థలం లేక చిన్న పిల్లలను కూడా కాల్చేస్తున్నారు. అమెరికాలో ఇంకా లాక్ డౌన్ ప్రకటించడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికి ఆలోచిస్తున్నారు. దీనితో ప్రజలే ఇళ్ళకు పరిమితం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version