‘బావగారు బాగున్నారా’ మూవీలో ఓ చెరువులోని నీళ్ల కోసం రెండు ఊర్ల మధ్య జరిగిన పోటీల్లో చిరంజీవి గుర్రపు స్వారీ చేసిన విషయం తెలిసిందే. అందులో తన గుర్రపు బండి చక్రం విరిగినా కొంత దూరం వెళ్లి మరల చక్రం బిగించుకుని పందెంలో విజయం సాధిస్తాడు.
అది రీల్ సీన్. కానీ, రియల్ సీన్లో మాత్రం నిర్వహించిన ఎద్దుల బండి పోటీల్లో చక్రం విరిగినా రెండు కిలో మీటర్ల దూరం వరకు చక్రం లేకుండానే బండిని పరిగెత్తించి విజయం సాధించాడో వ్యక్తి. తమిళనాడులోని మేలూరు ఎద్దుల బండ్ల పోటీలో సారథి అనే వ్యక్తి బండికి చక్రం విరిగినా 2 కిమీ దూరం పరిగెత్తించి మూడో బహుమతి గెలుచుకున్నాడు. అతని సంకల్పం,పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోయారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎద్దుల బండ్ల పోటీలో అసాధారణ గెలుపు.
తమిళనాడులోని మేలూరు ఎద్దుల బండ్ల పోటీలో, సారథి అనే వ్యక్తి బండికి చక్రం విరిగినా, 2 కిమీ దూరం పరిగెత్తించి మూడో బహుమతి గెలుచుకున్నాడు.
అతని సంకల్పం, పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోయారు. pic.twitter.com/PbuOnUWWM2
— greatandhra (@greatandhranews) February 22, 2025