కుక్క కాటు.. వైద్యుడి నిర్లక్ష్యంతో బాలుడి మృతి

-

కుక్క కరిచిందని ఆస్పత్రికి వెళితే చిన్నగాయమే అని వైద్యుడు తిరిగి పంపించడంతో కొన్నిరోజుల తర్వాత ఓ బాబు మృతి చెందాడు.ఈ ఘటన అలంపూర్ మండలం పరిధిలోని క్యాతూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. క్యాతూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ వెంకటలక్ష్మి దంపతులకు హర్షవర్ధన్ (4), హర్షిత(3) ఇద్దరు పిల్లలున్నారు.

జనవరి 22న వారి ఇద్దరు పిల్లలని కుక్క కరిచింది. పేరెంట్స్ తమ పిల్లలిద్దరినీ క్యాతూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. పాపకు ట్రీట్మెంట్ ఇవ్వగా.. బాబుకు చిన్న గాటు పడిందని, ఏం కాదని చెప్పడంతో పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లారు.

పాపకు నయం కాగా రెండు రోజులుగా బాలుడు విచిత్రంగా ప్రవర్తించాడు. కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మరల తీసుకెళ్లగా బాబుని పరీక్షించిన డాక్టర్లు కుక్క కాటుకు ట్రీట్మెంట్ చేయకపోవడంతో బతకడం కష్టం అని తెలిపారు. అనంతరం హైదరాబాద్ తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. దీంతో హర్షవర్ధన్ (4) ఆదివారం మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు ప్రాణాలు పోయాయని పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news