లూసీఫ‌ర్‌కు త‌ప్ప‌ని చిక్కులు.. మెగాస్టార్‌కు మ‌రో దెబ్బ‌!

-

మెగాస్టార్ నుంచి సినిమా వ‌స్తుందంటే ఆ మాస్ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఆయ‌న వ‌య‌సుతో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు తీస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఆచార్య సినిమా తీస్తున్నారు. ఇప్ప‌టికే 70శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది.

ఈ మూవీలో చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో దీనిపై భారీగా అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పోస్ట‌ర్లు విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. దీని త‌ర్వాత మెగాస్టార్ లూసీఫ‌ర్ రీమేక్‌లో న‌టించ‌నున్న‌సంగ‌తి తెలిసిందే.

అయితే దీనికి డైరెక్ట‌ర్ ను వెతుకే ప‌నిలో ప‌డ్డారు మూవీ మేక‌ర్స్‌. మొన్న‌టి వ‌ర‌కు సుజీత్ తో పాటు బిగ్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ పేర్లు వినిపించాయి. కానీ వీరు సెట్ కావ‌ట్లేద‌ని ఫైన‌ల్‌గా మోహ‌న్‌రాజాను సెలెక్ట్ చేశారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అయితే ఇప్పుడు అత‌ను కూడా త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల డైరెక్ట‌రే స్వ‌యంగా త‌ప్పుకున్నాడ‌ని స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారు మేక‌ర్స్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version