కన్నడ ప్రముఖ హీరో చిరంజీవి సర్జా ఇటీవలే గుండెపోటుతో మరణించడంతో అందరిలోను తీవ్ర విషాదం నింపింది. 36 ఏళ్ల వయసులోనే చిరంజీవి ఆకస్మిక మరణం అందరిని కలిచివేసింది. ఆయన అకాల మరణం చెందినప్పుడు తన భార్య మేఘానా రాజ్ నిండు గర్భిణి. భర్త లేని లోటు ఆమెను కృంగదీసింది. ఇటీవలే చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో ఆమెకు సీమంతం కూడా జరుపుకున్నారు. ఆ ఫొటోలు చూసిన అభిమానులు అంతా కన్నీళ్ల పర్వం అయ్యారు.
ఇపుడు తాజాగా చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన అన్నయ్యే మళ్లీ పుడుతాడు అంటూ చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా తెలిపిన మాట నేడు నిజమైంది. ఇటీవల ధృవ సర్జా వెండి ఉయ్యాల కూడా చేయించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సర్జా లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు మేఘనను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈరోజు మేఘనకు మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఇంకో విశేషం ఏంటంటే నేడు చిరంజీవి-మేఘనల ఎంగేజ్ మెంట్ డే కూడా.