విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు ఫైల్

-

వైఎస్సాఆర్‌సీపీ నేత, విలక్షణ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళిపై మరో కేసు ఫైల్ అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై గతంలో చేసిన అనుచిత వాఖ్యలపై కడప జిల్లాలోని రిమ్స్ పీఎస్‌లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్ ఫిర్యాదు చేశారు.ఇప్పటికే రాజంపేట పీఎస్‌లోనూ వీరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఇప్పటివరకు పోసాని మీద మొత్తం 50కి పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను తెలుగు యువత,ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు.ఈ మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు లేదా మూడు రోజుల్లో నోటీసులు ఇస్తామని పోలీసులు వెల్లడించారు.కాగా, మరోవైపు సినీ నటి శ్రీరెడ్డిపై సైతం పలు పీఎస్‌లలో ఫిర్యాదులు అందగా.. మొత్తం మూడు కేసులు ఆమె మీద నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version