కొర‌టాల – మెగాస్టార్ సూప‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది..

-

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా – న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ. 200 – 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే షూటింగ్‌లో జాయిన్ అయిపోనున్నాడు.

Chiranjeevi Begins Shoot in Palasa

ఈ సినిమా శ్రీకాకుళం జిల్లాలోని ప‌లాస ప్రాంతంలో తొలి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అక్క‌డ అక్క‌డ షూటింగ్ ప్లేస్‌ల‌ను ఎంపిక చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి మేజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ వీక్‌లో ఈ సినిమాలో చిరు లుక్ కి సంబంధించి లుక్ టెస్ట్ జరగనుందట. ఈ లుక్ టెస్ట్‌ను బ‌ట్టే సినిమాలో చిరు గెట‌ప్ డిసైడ్ చేసేలా కొర‌టాల ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఇక పూర్తిగా ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమాలో చిరు రెండు విభిన్న‌మైన గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. చిరు స‌ర‌స‌న ఖైదీ నెంబ‌ర్ 150లో రొమాన్స్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాలే మ‌రోసారి ఈ సినిమాలో కూడా జతకట్టనుందని టాక్‌. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరు త‌న‌యుడు రామ్‌చరణ్‌ నిర్మించే ఈ సినిమా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న అధికారికంగా ప్రారంభం కానుంది.

ద‌ర్శ‌కుడు కొర‌టాల చిరు కోసం మాంచి సోష‌ల్ మెసేజ్‌తో కూడిన స్క్రిఫ్ట్ రెడీ చేశాడ‌ట‌. కొర‌టాల సినిమాలో మంచి సందేశంతో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఇప్పుడు చిరు సినిమా సైతం అదే ఫార్మాట్‌లో ఉండ‌నుంద‌ట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version