చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

-

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు. నేటితో 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు నాయకులు.

కేక్ కటింగ్, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదానాలతో పాటు ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణీ చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ” శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ట్విట్ చేశారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version