ఈనెల 28 నుండి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ

-

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ.. అందుకు తగిన ప్రణాళిక అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు రాబోయే ఎన్నికలలో మొత్తం 72 మంది కొత్తవారికి సీట్లు కేటాయించింది.

అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెనర్ల జాబితాను సైతం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా తో పాటు పార్టీకి చెందిన పలువురి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 28 నుండి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈనెల 28 నుండి దాదాపు వారం రోజులపాటు కర్ణాటకలో ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు 20 చోట్ల భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొనేలా ప్రచారానికి ఏర్పాట్లు చేశారు కర్ణాటక బిజెపి నేతలు. ఇక నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండడంతో ప్రచారంపై ప్రణాళిక రూపొందిస్తున్నారు బిజెపి నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version