అల్లు అర్జున్ పోస్టర్ పై అలాంటి కామెంట్స్ చేసిన చిరు..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య బయట గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వీరు మాత్రం బయటపడే ప్రయత్నం చేయలేదు. అయితే ఒక రకంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ పైన పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఆయన ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అటు చిరంజీవి బర్త్ డే కి, ఇటు రాంచరణ్ బర్తడే కి కూడా అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ చిరంజీవి , రామ్ చరణ్ లున్ మాత్రం తమ మంచి మనసులను మరొకసారి చాటుకున్నారు. నిన్న అల్లు అర్జున్ బర్తడే సందర్భంగా చిరంజీవి పొద్దున్నే బర్తడే విషెస్ చేయగా మధ్యాహ్నం రామ్ చరణ్ కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు.

అయినా బన్నీలో మాత్రం మార్పు రాలేదు. అయితే చిరంజీవి అవేవీ పట్టించుకోకుండా అల్లు అర్జున్ సినిమా అప్డేట్స్ పై కూడా స్పందిస్తూ ఉండడం గమనార్హం. తాజాగా అల్లు అర్జున్ తన బర్తడే కు ఒక్క రోజు ముందు అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. ఎప్పుడు చూడని గెటప్ లో అందరి ముందుకు వచ్చాడు. తన అన్న ఎక్స్పెక్టెడ్ ఇంట్రో తో అందరిలో గూస్ బంప్స్ తెప్పించాడు అల్లు అర్జున్. ఉగ్ర గంగమ్మ రూపంతో అందరినీ ఆకట్టుకున్న అల్లు అర్జున్ తన గెటప్ తో చిరంజీవిని కూడా ఆశ్చర్యపరిచాడు అని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే సాధారణంగా తమ కుటుంబంలోని హీరోలైనా.. బయట హీరోలైనా అందరినీ ఆకట్టుకునేలా ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే గుణం చిరంజీవికి ఉంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గెటప్ ని కూడా ఆయన మెచ్చుకున్నారు. హ్యాపీ బర్తడే బన్నీ అని చెబుతూనే పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే అల్లు అర్జున్ తన గెటప్ తో చిరంజీవిని కూడా మెప్పించాడు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version