‘మోదీ.. అణు యుద్ధాన్ని ఆపి.. పెను విధ్వంసాన్ని తప్పించారు!’ : CIA చీఫ్

-

ప్రధాని మోదీ అణు యుద్ధాన్ని ఆపి.. పెను విధ్వంసాన్ని తప్పించారని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ బిల్ బర్న్స్​ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అణ్వాయుధాల వినియోగంపై మోదీ ఆలోచనలు రష్యాపై ప్రభావం చూపాయని అన్నారు. ఫలితంగా, ఉక్రెయిన్ యుద్ధంలో పెను విధ్వంసం తప్పిందని చెప్పుకొచ్చారు.

“చైనా ప్రధాని షీ జిన్‌పింగ్​తో పాటు ప్రధాని మోదీ సైతం అణ్వాయుధాల వినియోగం గురించి తమ ఆందోళనలను లేవనెత్తారు. ఈ విషయం రష్యన్‌లపై ప్రభావం చూపింది. అణ్వాయుధాల ఉపయోగంపై రష్యా ఉద్రిక్తతలు కేవలం రెచ్చగొట్టడానికి మాత్రమే. అణ్వాయుధాలు వాడటానికి రష్యా సన్నద్ధమవుతున్నట్లు ఆధారాలేవీ లేవు” అని బిల్ బర్న్స్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version