షాకింగ్: భవిష్యత్ లో మొత్తం పూర్తి నగ్నంగానే..!!

-

షారుక్ ఖాన్ , దీపిక పదుకొనె నటించిన పఠాన్ సినిమా బేషరమ్‌ రంగ్‌’ అనే పాటపై  రచ్చ రచ్చ చేస్తున్నారు  రాజకీయ నాయకుల నుంచి మొదలు కొందరు సినీ తారలు సైతం బహిరంగంగానే ఈ పాటను ట్రోల్ చేయడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఈ అంశం మారింది. ఈ పాటలో దీపికా సంసృతి ని మంటగలిపింది అని కొందరు, కాషాయ దుస్తులు ధరించిందంటూ మరికొందరు ఇలా ట్రోలింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందీ పాట.

ఇదిలా ఉంటే దీపికను ట్రోలింగ్ చేస్తున్న వారున్నట్లే, సపోర్ట్‌ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ప్రకాష్ రాజ్, రమ్య మరికొంత మంది సపోర్ట్ చేస్తున్నారు.తాజాగా ఈ సాంగ్ వివాదంపై శక్తిమాన్ నటుడు.. ముకేశ్ ఖన్నా స్పందించారు. ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాంగ్ చూసేందుకు చాలా అసభ్యకరంగా ఉందని.. ఇతరుల ఫీలింగ్స్ ను రెచ్చగొచ్చేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ పోర్ట్ ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు.

ముకేష్ ఖన్న ఈపాటపై ఆగ్రహం వ్యక్టంచేసారు. బాలీవుడ్ సినీ పరిశ్రమ గాడి తప్పింది. అశ్లీలత ఎక్కువైంది. ఇప్పుడు పొట్టి పొట్టి దుస్తులు… నటీనటుల్ని చూపించిన ఫిల్మ్ మేకర్స్.. భవిష్యత్తులో వాళ్లను నగ్నంగా చూపించే ఆస్కారం ఉంది. ఇలాంటి వాటిని సెన్సార్ బోర్డు ఆపకుండా ఏమి చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే దేశం సర్వ నాశనం అవుతుంది అని మండి పడ్డారు. ఇక ఈ సినిమా ముందు ముందు ఎన్ని వివాదాలు ఎదుర్కొంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version