శంషాబాద్ ఎయిర్ పోర్టులో కలకలం చోటు చేసుకుంది. లో-దుస్తుల్లో లైటర్ లను పెట్టుకుని ఓ మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నాలు చేసింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళుతున్న ప్రయాణికురాలి వద్ద మూడు లైటర్ లను స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు. మహిళ లైటర్ లను లో-దుస్తులలో అమర్చుకొని ప్రయాణిస్తుండగా గుర్తించారు సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు.

దీంతో అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు….ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా లైటర్ ల గుట్టురట్టయింది. మహిళ వద్ద ఉన్న మూడు లైటర్ లను స్వాధీనం చేసుకుని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇక ప్రస్తుతం ఆ మహిళను ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారణ చేస్తున్నారు.