యూనియన్ పబ్లిక్ కమిషన్ (UPSC) గత సంవత్సరం నిర్వహించిన సివిల్స్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలో 869 మందిని ఎంపిక చేసింది యూపిఎస్సి. తాజాగా విడుదలైన ఫలితాలలో హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంకును సాధించారు. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలువురు అత్యుత్తమ ర్యాంకు సాధించారు. తెలంగాణ లోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ నగరానికి చెందిన ధాత్రి రెడ్డి 46 ర్యాంకును సాధించారు. అతనొక్కడే టాప్ 50 లో రెండు తెలుగు రాష్ట్రాల తరుపున నిలిచారు. ప్రస్తుతం ఆయన ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నారు.
ఇక ఈయన తర్వాత మన తెలుగు రాష్ట్రాలలో మల్లవరపు సూర్యతేజ(76), కట్టా రవితేజ(77), సింగారెడ్డి రిషికేశ్ రెడ్డి(95) టాప్ 100 లో నిలిచారు. అలాగే వివిధ ఉద్యోగాలలో కొనసాగుతున్న అనేక తెలుగు వ్యక్తులు సివిల్స్ లో విజయం సాధించారు. భారతదేశంలో నిర్వహించే అతి కఠిన పరీక్షలలో సివిల్ పరీక్షలు ప్రధానమైనవి.