ప్రజాప్రతినిధుల కేసులపై సీజేఐ ఎన్వి రమణ సీరియస్

-

ప్రజాప్రతినిధులకు కేసులపై సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వి రమణ.. సిబిఐ మరియు ఈడీ లపై సీరియస్ అయ్యారు. ప్రజాప్రతినిధుల కేసులో ఛార్జిషీట్ దాఖలు ఆలస్యంపై సీజేఐ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ నివేదిక అందించింది. సుప్రీంకోర్టుకు రిపోర్టు అందించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా.. మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

మనీలాండరింగ్ కేసుల్లో 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులు ఉన్నారని.. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‍లో ఉన్నాయని తెలిపారు. 58 పెండింగ్ కేసుల్లో జీవతఖైదు శిక్షలు విధించతగినవని.. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని పేర్కొంది అమికస్ క్యూరీ. ఇక ఈ నివేదిక పై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సిబిఐ మరియు ఈడీ లపై సీరియస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ సీబీఐ విచారణ కోరుతున్నారని.. అయితే దీనికి మానవ వనరుల కొరత ప్రధాన సమస్య ఉందని తెలిపారు. ముఖ్యంగా జడ్జిల సంఖ్య మరియు మౌలిక సదుపాయాలు ప్రధాన సమస్య అని పేర్కొన్న సీజేఐ… కుదిరితే ప్రత్యేక కోర్టులో ఏర్పాటుపై హైకోర్టులకు సూచిస్తాము అని తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version