కొడుకు కోసం.. మళ్ళీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

-

ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…. తన విలక్షణ నటనతో దక్షిణాది లో మంచి పేరు తెచ్చుకుని, అటు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్న నటుడు ప్రకాష్ రాజ్. ఎంత బిజీగా ఉన్నా కూడా డా.తలతోటి కుటుంబంతో క్వాలిటీ టైం గడుపుతూ ఉంటారు ప్రకాష్ రాజ్. అయితే తాజాగా ప్రకాశ్ రాజ్ తన కొడుకు వేదాంత కోరిక మేరకు మరోసారి పెళ్లి చేసుకున్నారు.

ఆగస్టు 24న తన పెళ్లి రోజు సందర్భంగా కొడుకు వేదాంత కోసం… భార్య పోనీ వర్మ ను పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. అయితే ఈ పెళ్లి సంబరానికి మొదటి భార్యతో తనకు కలిగిన సంతానం సైతం హాజరు కావడం విశేషం. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ప్రకాష్ రాజ్ తన అభిమానుల కోసం సోషల్ మీడియా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అటు ఈ ఫోటోలు చూసిన ప్రకాష్ రాజ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version