తెలుగు రాష్ట్రాల పర్యటనలో సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫుల్ బిజీ అయ్యారు. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. రేపు లేదా ఎల్లుండి యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ సందర్బంగా యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కూడా యాదాద్రికి వెళ్తారు.
కాగా ఆంధ్ర ప్రదేశ్ పర్యటనను ముగించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఏ సందర్బంగా సిజెఐ ఎన్.వి.రమణకు తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిజెఐ ఎన్.వి.రమణకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు వచ్చిన ఎన్వి రమణ రాజ్ భవన్ లో బస చేస్తున్నారు. అటు రాజ్ భవన్ లో ఎన్వి రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగతం పలికారు.