ఈ మహమ్మారి సమయంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

మహమ్మారి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి సమయం లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ పద్ధతులు పాటించండి. దీంతో వాళ్లు ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆనందంగా ఉంటారు. మరి వాటి కోసం ఇప్పుడు చూసేయండి.

యోగా చేయడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి రోజూ మీ పిల్లల చేత ఈ యోగాసనాలు చేయించండి. దీనితో వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు.

వృక్షాసనం:

పిల్లలకి వృక్షాసనం చాలా మంచిది. దీనిని వాళ్ళు రోజూ చేయడం వల్ల వాళ్ళు పొడవు ఎదగగలరు. వృక్షాసనం వల్ల చేతి మజిల్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఇలా క్రమంగా వాళ్ళు పొడవు ఎదుగుతారు. ఈ ఆసనం చేయడం చాలా సులువు.
ముందు నించుని మీ చేతులు రెండూ కూడా మీ తొడలు దగ్గరికి తీసుకు వచ్చి..
నెమ్మదిగా మీ మోకాలు ని బెండ్ చేసి స్లోగా శ్వాస తీసుకుంటూ మీ చేతుల్ని పైకి తీసుకురండి.
ఇలా ఈ పోస్టర్ లో వుంది శ్వాసని బయటికి వదిలేయండి.

పర్వతాసనం:

ఇది కూడా పిల్లలకు చాలా మంచిది. భుజాలని దృఢంగా ఉంచుతుంది. అదే విధంగా మెడ నొప్పి వంటివి తొలగిస్తుంది.

దీని కోసం మొదట కూర్చుని రెండు చేతుల్ని జోడించి..
ఇప్పుడు మీ చేతుల్ని తిప్పి మీ తల నుంచి పైకి పెట్టండి.
ఈ పోస్టర్ లో ఒక రెండు నిమిషాల పాటు ఉండండి.

అలానే ఇతర ఏ ఆసనాలు అయినా వేయించచ్చు. మెడిటేషన్ చేయించడం వల్ల కూడా వాళ్లకి మంచి కలుగుతుంది, మెడిటేషన్ వల్ల శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version