నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య బయటపడిన విభేదాలు…?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పాత్ర లేకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఆయన రాజకీయాల్లోకి రావాలని పలువురు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన అభిమానుల కోరిక కూడా ఇదే. అయినా సరే ఆయన మాత్రం రాజకీయాల్లోకి రావడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ప్రస్తుతం రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఇది పక్కన పెడితే, ఆయనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి మధ్య విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. వీరిద్దరి మధ్య మరోసారి పార్టీలో కనపడని ఆధిపత్య పోరు నడుస్తుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి గాను పార్టీలో కీలక పదవులను కొందరు యువనేతలకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే కొందరు యువనేతల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తూ వస్తుంది.

ఈ తరుణంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక నేతకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నేతకు కూడా పదవి ఇవ్వాలని ఎన్టీఆర్ ఎవరితోనో చెప్పించారు. దీనికి లోకేష్ అడ్డుపడ్డారని సమాచారం. ఇటీవల లోకేష్ ఇంట్లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సదరు యువనేతలతో కనీసం లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటున్నారు.

ఫోటో కూడా కలిసి దిగలేదని సమాచారం. దీనితో ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పారట వాళ్ళు. దీనితో జూనియర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వాళ్ళను వైసీపీలోకి వెళ్ళిపోమని తాను మంత్రి నానీ తో మాట్లాడతా అని చెప్పారట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హైలెట్ గా మారింది. పార్టీకి దూరంగా ఉన్న ఎన్టీఆర్ పదవులు ఎందుకు అడుగుతారు అని ఆయన అభిమానులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version