ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో కాంగ్రెస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పది మందికి గాయాలు అయినట్లు సమాచారం.
తీవ్ర గాయాలైన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలు ఇండ్లు, టీవీలు, బైకులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కృష్ణాపురం గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పరం దాడులకు సంబంధించిన అసలు విషయం తెలియాల్సి ఉంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో భగ్గుమంటున్న వర్గవిభేదాలు
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో పరస్పరం దాడులు చేసుకున్న కాంగ్రెస్ నేతలు
దాడిలో పది మందికి గాయాలు
తీవ్ర గాయాలైన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలింపు
ఘటనలో పలు ఇండ్లు, టీవీలు, బైకులు… pic.twitter.com/PklmOu0ebt
— TNews Telugu (@TNewsTelugu) March 31, 2025