వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద హై టెన్షన్

-

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరంట్ల మాధవ్ ఇంటికి నేటి ఉదయం భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆదివారం జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే.

దీంతో మృతుడి స్వగ్రామం అయిన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లేందుకు గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా గోరంట్ల మాధవ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలిసి వైసీపీ కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకుంటున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news