ఐసీఎస్ఈ, ఐఎస్‌సీకి చెందిన 10, 12 తరగతుల పరీక్షా ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల ఫలితాలను విద్యార్థులు cisce.org లేదా results.cisce.org అనే సైట్లలో చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఫలితాలను ఎస్ఎంఎస్ రూపంలోనూ పొందవచ్చు.
ఐసీఎస్ఈ, ఐఎస్‌సీకి అనుబంధంగా ఉన్న స్కూళ్ల ప్రిన్సిపాళ్లు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి కెరీర్స్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి ఫలితాలను తెలుసుకోవచ్చు.
కాగా కోవిడ్ నేపథ్యంలో ఐసీఎస్ఈ, ఐఎస్‌సీ కౌన్సిల్ మార్చి 19 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన ఆయా పరీక్షలను వాయిదా వేసింది. ఈ క్రమంలో కౌన్సిల్ జూన్ నెలలోనే పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. విద్యార్థుల అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా ఫైనల్ రిజల్ట్స్‌ను వెల్లడిస్తామని కౌన్సిల్ తెలిపింది. అందులో భాగంగానే కౌన్సిల్ ఎట్టకేలకు ఆ ఫలితాలను విడుదల చేయనుంది.