రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

-

సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కానుంది.2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్‌ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్‌లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు.

ఐదేళ్లపాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన వైఎస్ జగన్‌.. భవనాలను పాడుబెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 70.. 80శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను కూడా వైసిపి ప్రభుత్వం వదిలేసిందని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. తాజాగా ఆయన.. సీఎం హోదాలో రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version