టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమోటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది.సాధారణంగా ఈ సీజన్లో టమోటా ఒక్కో బాక్స్ ధర రూ. 500 లోపే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన వేడే దానికి కారణమని అధికారులు తెలిపారు. అధిక వేడితో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. గడిచిన 20రోజుల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు పెరిగి కిలోకు రూ.50కి వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.80కిపైగా ఉంది.
ఈరోజు రాష్ట్రంలో టమాటా ధరలు రికార్డు స్థాయిలో రైతు బజార్ లోనే 71 రూపాయలు పలికింది. బయట మార్కెట్ లో 100 నుంచి 120 రూపాయలు ఉంది. ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల టమాటో సాగు తగ్గిందని రైతులు చెబుతున్నారు .తెలంగాణలో కూరగాయల పంటలు సరిగ్గా పండకపోవడంతో ఏపీలోని మదనపల్లి మీద ఆధారపడాల్సి వస్తోందని రైతులు వెల్లడించారు. ఒక నెల రోజులపాటు ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ,వర్షాలు జోరందుకుంటే.. ధరలు దిగివచ్చే అవకాశం ఉంది అని తెలిపారు.