ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు ప్రపంచ 11 ర్యాంకర్ వాంగ్ జి ఈ (చైనా) పై గెలుపొందింది. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్షణాల వ్యవధిలోనే ఆమెను కొనియాడుతూ ట్వీట్ చేశారు.” సింగపూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన పి.వి.సింధు కు అభినందనలు. ఇది ఆమెకు తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్. ఈ ఏడాది మూడో టైటిల్. ఈ విజయానికి ముందు సింధు కొరియా ఓపెన్,స్విస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గింది. యావత్ భారత్ గర్వించే విజయాన్ని అందుకుంది”. అంటూ ట్వీట్ చేశారు.
కాగా షట్లర్ పీవీ సింధూ మరో సంచలన విజయం సాధించింది. 2022లో పీవీ సింధు మూడో టైటిల్‌ను గెలుచుకుంది. తాజాగా చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిని ఓడించి షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 21-9, 11-21, 21-15 స్కోరుతో వాంగ్ జి యిని ఓడించి సింగపూర్‌లో తన తొలి టైటిల్‌ను గెలుచుకుంది పీవీ సింధూ.
Congratulations to @Pvsindhu1 for clinching the Women's Single title at #SingaporeOpen, her maiden title in Singapore Open and third title this year after registering wins in Korea Open and Swiss Open.
A proud day for 🇮🇳— YS Jagan Mohan Reddy (@ysjagan) July 17, 2022