ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడితో బుధవారం సమావేశమైన జగన్ ఈ సందర్భంగా రాజధాని సహా పోలవరం నిధుల గురించి చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా మోడిని జగన్ అడిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా వీరి మధ్య కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రకటన గురించి జగన్ మోడీ తో మాట్లాడారట. రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరాన్ని ఆయనకు వివరించగా మోడీ కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మూడు రాజధానుల విషయంలో ముందు అడుగు వెయ్యాలి అంటే అమిత్ షా ని కలవాలని చెప్పినట్టు సమాచారం. బుధవారం, గురువారం నాడు షా బిజిబిజీగా ఉండటంతో అపాయిట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది.
శుక్రవారం నాడు షా అపాయిట్మెంట్ దొరికిందని.. ఆయనతో జగన్ భేటీ అయ్యి మూడు రాజధానుల తరలింపు గురించి ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ వెంట విజయసాయిరెడ్డి, ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. పెద్దిరెడ్డి, బొత్సా ఆయనతో వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఈ పర్యటన ఎందుకు అనేది ఇంకా స్పష్టత రాలేదు.