పవర్ స్టార్ తో ఇస్మార్ట్ బ్యూటీ ఫిక్సైందా ..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చి దిల్ రాజు బ్యానర్ లో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాలీవుడ్ సినిమానే కోలీవుడ్ లో నూ నిర్మించారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళంలో అజిత్ పోషించిన పాత్రను ఇక్కడ మన పవర్ స్టార్ పోషిస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసి కంప్లీట్ గా రాజకీయలలో బిజీ అయిపోయారు. అంతేకాదు ఇకపై నేను సినిమాలు చేయను అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ స్టేట్ మెంట్ మెగా ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కి మింగుడు పడలేదు.

 

అందరూ పవన్ మళ్ళీ సినిమాల్లోకి రావాలని బలంగా కోరుకున్నారు. ఆ బలమైన కోరికే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఒకటి కాదు ఏకంగా ఒకేసారి మూడు నాలుగు సినిమాలు మొదలు పెట్టే ఊపుతో వచ్చిన పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడుగా సినిమాలను కమిటయి అనౌన్స్ చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ఒకటి దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ అయితే మరోటి ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం నిర్మించే సినిమా.

 

ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ మూవీ గా క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం. గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రాన్ని తీసి గొప్ప దర్శకుడనిపించున్న క్రిష్ ఈ పీరియాడికల్ సినిమాని తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది గత కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నారు. తాజాగా తెరమీదకి ఇస్మార్ట్ బ్యూటి నిధీ అగర్వాల్ పేరు వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవముందో తెలీదు గాని న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version