ఎప్పటికప్పుడు కొత్త సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరవుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వాహనమిత్ర, రైతు భరోసా, అమ్మ ఒడి అంటూ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్… త్వరలోనే జగనన్న విధ్యావసతి దీవెన కార్యక్రమం కూడా మొదలుపెట్టనున్నారు. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే జగన్న చేదోడు పథకం.
జగనన్న చేదోడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. రాబోయే ఐదేళ్లపాటు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణచించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పథకాన్ని ప్రారంభించేందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఇప్పటికే కాపు మహిళలకు కూడా జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా జగన్ ఎప్పటికప్పుడు సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే జగన్ ఎప్పటికప్పుడు ప్రజల కోసం కొత్త కార్యక్రమాలను తీసుకోస్తూనే ఉన్నారు. దీనిపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులు, మహిళలు, రైతులు ఇలా అందరికి దగ్గరవుతున్నారు.