ఏపీలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. సీఎం జగన్‌ కీలక నిర్ణయం

-

నేడు సీఎ జగన్‌ ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీ విద్యార్థుల నైపుణ్యాలను బాగా పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్‌. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సీఎం జగన్‌ సూచించారు. జిల్లాల్లో ఉన్న పరిశ్రమల మేరకు కోర్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు సీఎం జగన్‌. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విదేశాల్లో కోర్సులు పరిశీలించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌. ఉన్నత విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలని, కోర్టు కేసులు పరిష్కరించుకుని జూన్ నాటికి భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నామని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

 

కాగా, సీఎం జగన్ ఈ సమీక్ష సమావేశంలో ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో బోధన, వసతుల అంశంపైనా చర్చించారు. బోధన సిబ్బంది, వసతి సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. బోధన సిబ్బంది సామర్థ్యం మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతి, విశాఖలోని స్టాఫ్ కాలేజీలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. సెంట్రల్ ఆంధ్రా పరిధిలో అకడమిక్ స్టాఫ్ కాలేజి ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రిపుల్ ఐటీల్లో సిబ్బంది భర్తీ, సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version