అమరావతి : గులాబ్ తుపాను, అనంతర పరిస్థితుల పై సీఎం వైయస్. జగన్ సమీక్ష నిర్వహించారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని… ప్రతి అరగంటకూ విద్యుత్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని ఆదేశించారు.
ఆమేరకు వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలన్నారు. ఇవాళ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎస్‌కు సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు జగన్. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దని తెలిపారు సీఎం జగన్. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్న సీఎం.. ఆయా కుటుంబాలకు రూ.1000 చొప్పున ఇవ్వాలన్నారు. సహాయ శిబిరాలనుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఇవ్వాలన్నారు.