ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. వచ్చే ఫిబ్రవరీలోగా 14,788 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన చేశారు. ఏపీ సీఎం వైయస్ జగన్. నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. రూ. 16,255 కోట్లతో ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని…. ఆరోగ్య శాఖలో 9712 పోస్టులు భర్తీ చేసామన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఆరోగ్య శ్రీ అనే ఈ ఒక్క పథకం మమ్మల్ని కాపాడుతుంది అన్న భరోసాను కల్పించేలా పేదలకు వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్య శ్రీ పరిధిలో రూ.10 నుండి రూ. 12 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలను కూడా ఎక్కడా కోతలు పెట్టకుండా మానవీయ కోణంలో వర్తింపజేస్తున్నామని ప్రకటన చేశారు సీఎం జగన్. ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని.. దీనివల్ల ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయన్నారు. గిరిజన ప్రాంతంలో కొత్తగా టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం వైయస్ జగన్.