ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఇటీవల కోనసీమ జిల్లాలోని చోటు చేసుకున్న అల్లర్లను గురించి వివరించారు. కోనసీమ జిల్లాలో తాజా పరిస్థితుల గురించి గవర్నర్‌కు జగన్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అల్లర్లకు దారి తీసిన పరిస్థితులు, జిల్లా పేరు మార్పు దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీమశ్ ఇళ్లను ఆందోళనకారులు దహనం చేసిన తీరు… తదితర అంశాలపై గవర్నర్‌కు జగన్ పూర్తి వివరాలను అందజేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే… త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, అందులో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లులపైనా గవర్నర్‌తో జగన్ చర్చించినట్లుగా సమాచారం. అసెంబ్లీ. శాసన మండలి వ్యవహారాలపైనా గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు సమాచారం.