మహాభారతం ఒక ఇతిహసమే కాదు, మానవుడు తన జీవితంలో ఏ విధముగా నడుచుకోవాలో, ఆపద సమయంలో తెలివిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలియజేసే సూత్రధారి కూడా..తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే నానుడి. అలాంటి మహాభారతంలో కొన్ని ఆశ్చర్యపరిచే రహస్యాలు దాగి వున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
1. పాండవుల తండ్రి పాండురాజు.. కొడుకులను ఉద్దేశించి చెబుతూ.. చనిపోయిన వెంటనే తన మెదడు తీసి తినేవారికి భూత,భవిష్యత్,వర్తమానాలు తెలుస్తాయని అందుకు తన మెదడును అందరూ తినాలని పాండురాజు చెబుతాడు. భూత,వర్తమాన, భవిష్యత్ కాలాలు తెలిసినప్పటికీ ఎవరికీ చెప్పకూడదు అలా చెబితే తమ ప్రాణాలు విడవాలసిందే అని పాండురాజు చెబుతాడు. కానీ దీనికి ఎవరు ఒప్పుకొని ముందుకు రారు. పాండవులలో చివరి వారు సహదేవుడు ముందుకు వచ్చి పాండురాజు చనిపోయిన తరువాత అతని యొక్క మెదడును తింటాడు. మొదట సారి తిన్నప్పుడు భూతకాలం తెలిసింది. రెండవసారి తిన్నప్పుడు భవిష్యత్ కాలం తెలిసింది. మూడవ సారి తిన్నప్పుడు వర్తమాన కాలం తెలిసింది.ఈ విషయాలన్నీ తెలుసుకున్న శకుని మామ దుర్యోధనుడిని కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుని దగ్గరికి పంపుతాడు. దుర్యోధనుడు శత్రువు అని తెలిసినా సహదేవుడు కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెడతాడు.
2. దృతారాష్ట్రుడికీ వందమంది కుమారులు ఒక కుమార్తె అని అందరికీ తెలుసు. కానీ అతనికి 101వ కుమారుడు కూడా ఉన్నాడు అని తెలియదు.అతనే యుగఫసుడు. యుగఫసుడు ధృతరాష్ట్రుడికి అతని దగ్గర పనిచేసే ఒక దాసికి పుట్టిన కుమారుడు. దాసి ఒక వ్యభిచారి.ఇతను తన తండ్రి దగ్గరే మంత్రిగా ఉంటాడు తప్ప ఎవరికీ తాను కౌరవ పుత్రుడని చెప్పుకోడు.
3. రాజులందరు పాండవుల వైపునో లేక కౌరవుల వైపునో పోరాడుతున్నారు కానీ ఉడిపి రాజు మాత్రం ఎవరి వైపు ఉండకుండా యుద్ధం చేసేవారందరికి 18 రోజులపాటు భోజనం అందిస్తూ ఉండేవాడట. యుద్ధంలో ఎంత మందిచనిపోయారో యుద్ధభూమిలో వున్నవారికే తెలియదుకాని ఈయన మాత్రం భోజనం ఎవరికీ తక్కువ రాకుండా వృధా కాకుండా సరిగ్గా సరిపోయెట్టు వండేవారట.